: లీటరుకు రూపాయి పెరిగిన సంగం పాల ధర


గుంటూరు జిల్లాలోని అతిపెద్ద డెయిరీ అయిన 'సంగం' పాల ధరను పెంచింది. లీటరుకు ఒక రూపాయి చొప్పున ధర పెంచుతూ డెయిరీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుతం 22 రూపాయలకు విక్రయిస్తున్న లీటరు పాలుకు.. ఇకపై వినియోగదారులు 23 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా లీటరు టోన్డ్ మిల్క్ ధర 18 నుంచి 19 రూపాయలకు పెరిగింది. కొత్త ధరలు ఫిబ్రవరి 2వ తేదీ, ఆదివారం నుంచి అమలవుతాయి.
ఇంతకు మునుపే ఏపీ డెయిరీ కూడా విజయా పాల ధరను లీటరుకు రెండు రూపాయలు పెంచిన విషయం తెలిసిందే. పాల ఉత్పత్తికి అవసరమయ్యే ముడిపదార్థాల ధరలు పెరిగినందువల్లే పెంపు నిర్ణయం తీసుకొన్నామని ఏపీ డెయిరీ పాలక మండలి తెలిపింది.

  • Loading...

More Telugu News