: కేజ్రీవాల్ దారితప్పాడు: యోగా గురు రాందేవ్ బాబా
కొందరు రాజకీయ నాయకులు అవినీతిపరులంటూ.. ఎటువంటి సాక్ష్యాలు, ఆధారాలు లేకుండా అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించడాన్ని యోగా గురు రాందేవ్ బాబా తప్పుపట్టారు. వ్యవస్థను ప్రక్షాళన చేస్తానంటూ అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) అధినేత కేజ్రీవాల్ దారి తప్పారంటూ ఆయన వ్యాఖ్యానించారు.
"ఎవరి మీదనైనా ఆరోపణలు చేసేటప్పుడు తగిన ఆధారాలు చూపాలి, సాక్ష్యాధారాలు బయటపెట్టాలి. ఇతరులను అవినీతిపరులంటూ చెబుతోన్న ఏఏపీ నేతలు, దేశంలో అల్లకల్లోలానికి పాల్పడిన తమ సొంత పార్టీ నేత సోమనాథ్ భారతి లాంటి అవినీతిపరులను వెనకేసుకు రావడం తప్పు" అని రాందేవ్ బాబా మీడియాతో మాట్లాడుతూ అన్నారు.