: కర్నూలు జిల్లా ఉపాధ్యాయులకు విద్యాశాఖ నోటీసులు
కర్నూలు జిల్లాలోని 405 మంది ఉపాధ్యాయులకు విద్యాశాఖ నోటీసులు జారీ చేసింది. టీచర్ల సెలవుల వ్యవహారంలో సీరియస్ అయిన విద్యాశాఖ ఈ మేరకు చర్యలు తీసుకుంది. ఉపాధ్యాయులు ముందస్తు సమాచారం లేకుండా సెలవులు పెట్టడాన్ని విద్యాశాఖ తప్పుబట్టింది. దీంతో, ఉపాధ్యాయుల నుంచి 29 లక్షల 14 వేల రూపాయలు రికవరీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.