: మూడో ఫ్రంట్ కు ఊతిమిస్తున్న దేవెగౌడ
దేశ రాజకీయాల్లో సంచలనాత్మక మార్పుపై ప్రాంతీయ పార్టీలు దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. ఇప్పటివరకు దేశాన్ని రెండు జాతీయ పార్టీలే ప్రధానంగా పాలించడంపై గుర్రుగా ఉన్న ఆ పార్టీలు ఒకే వేదికపైకి వస్తున్నట్లు సంకేతాలు ఇస్తున్నాయి. రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో దేశంలోని ప్రముఖ ప్రాంతీయ పార్టీలన్నీ చేతులు కలపబోతున్నట్లు సమాచారం. ఈ వార్తలకు జేడీఎస్ నేత హెచ్ డీ దేవెగౌడ మరింత ఊతమిస్తున్నారు. ఓ ఆంగ్ల ఛానల్ తో మాట్లాడిన ఆయన, లోక్ సభ ఎన్నికలకు ముందు అదికారికంగా మూడో ఫ్రంట్ ఏర్పాటుపై నితీశ్ కుమార్, ములాయం సింగ్ యాదవ్, మమతా బెనర్జీతో చర్చలు చేస్తున్నామని చెప్పారు. ఈ మేరకు ఈ నెల చివర్లో తొలి సమావేశం నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు. దీనికి నాయకత్వం ఎవరు వహిస్తారనేది తర్వాత నిర్ణయిస్తామన్నారు.