: అవినీతిపరుడనని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: కపిల్ సిబల్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన అవినీతిపరుల జాబితాలో కేంద్రమంత్రి కపిల్ సిబల్ పేరున్న సంగతి తెలిసిందే. దానిపై తీవ్రంగా ఆగ్రహించిన సిబల్, తాను అవినీతిపరుడనని కేజ్రీవాల్ నిరూపిస్తే కనుక, రాజకీయాల నుంచి వైదొలగుతానన్నారు. ఆయన చెప్పిన వాటికి ఎలాంటి ఆధారాలు లేవని, అందరినీ మోసగించే వ్యక్తని ఆరోపించారు. తమపై నిందవేసేందుకే ఆప్ ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకునేలా కేజ్రీవాల్ ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు.