: తొలిసారిగా టీవీ షోకు రెహమాన్ సంగీతం!


సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ తొలిసారి ఓ టీవీ షోకు సంగీతాన్ని అందించబోతున్నాడు. హిందీ దర్శకుడు అశుతోష్ గోవారికర్ మొదటిసారి టీవీ రంగంలోకి అడుగిడి, పూర్తి ఫిక్షన్ నేపథ్యంలో షోను నిర్మించబోతున్నారు. ఇద్దరు దర్శకులు రూపొందించనున్న ఈ కార్యక్రమానికి రెహమాన్ సంగీతం ప్రత్యేక ఆకర్షణ. ఇంతవరకు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, హలీవుడ్ చిత్రాలకు పనిచేసిన ఈ స్వర మాంత్రికుడు టెలివిజన్ కు రావడం అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేస్తోంది. ఈ షో ప్రముఖ ఛానల్ లో ప్రసారం అవుతుంది.

  • Loading...

More Telugu News