: దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల బాధిత కుటుంబాలకు ఉద్యోగ ఉత్తర్వులు


దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల బాధిత కుటుంబీకులకు త్వరలోనే ఉద్యోగాలు ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసింది. ప్రాణాలు కోల్పోయిన లేదా, శాశ్వత వైకల్యం పొందిన వారి కుటుంబాల్లో ఒకరికి నష్టపరిహారంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారు. వారికి ఉన్న విద్యార్హతలను బట్టి జూనియర్ అసిస్టెంట్ స్థాయి వరకూ ఉద్యోగం కల్పించే బాధ్యతను ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు అప్పగించింది. ఈ నెలాఖరులోగా వారికి పోస్టింగ్స్ ఇవ్వాలని సంకల్పించారు.  

  • Loading...

More Telugu News