: మరణానంతరం అవయవాలు దానం చేస్తా: కపిల్ దేవ్
మరణానంతరం అవయవాలు దానం చేస్తామని ప్రముఖ మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్, బిషన్ సింగ్ బేడీ తెలిపారు. ఢిల్లీలో యూరాలజిస్ట్ సొసైటీ ఆధ్వర్యంలో ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆఫీసర్స్ క్లబ్ లో ఏర్పాటు చేసిన యూసికాన్ 14 కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా కపిల్, బేడీ హాజరయ్యారు. దేశ జనాభా 130 కోట్లు దాటినా అత్యధికులకు అవయవదానంపై అవగాహన లేదని అన్నారు. దీని కారణంగా మరణాలు సంభవించేటప్పుడు అవయవ దానం చేయక పలువురు రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు అభిప్రాయపడ్డారు. 'హర్ జాన్ కో అమర్ బనానా హై' స్లోగన్ తో యూరాలజిస్ట్ సొసైటీ అవగాహన కార్యక్రమం చేపట్టిందని తెలిపారు.