: లోక్ సత్తా సామూహిక సత్యాగ్రహ దీక్ష ప్రారంభం
సికింద్రాబాద్ పికెట్ మైదానంలో లోక్ సత్తా పార్టీ సామూహిక సత్యాగ్రహ దీక్ష ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ పాల్గొన్నారు. మద్యం కారణంగా భర్తలను కోల్పోయిన మహిళలను ఓదార్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన జేపీ, చిన్న వయస్సులో భర్త తాగుడుకు బానిసై, సంపాదనంతా తాగుడుకే ఖర్చు పెడితే మహిళలు ఆవేదన చెందుతారన్నారు.