: లూసియానా గవర్నర్ జిందాల్ కు తప్పిన ప్రమాదం


అమెరికాలో తొలిసారి ఓ రాష్ట్రానికి గవర్నర్ గా ఎన్నికై చరిత్ర సృష్టించిన భారత సంతతికి చెందిన బాబీ జిందాల్ ఓ ఘోర రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. లూసియానా గవర్నర్ జిందాల్.. కుమారుడి ఫుట్ బాల్ మ్యాచ్ వీక్షించి ఇంటికి తిరిగి వచ్చే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం బాటన్ రోడ్ వద్ద లూసియానా హైవేలో జిందాల్ ప్రయాణిస్తున్న కారును ఓ భారీ ట్రక్ ఢీకొట్టింది. అయితే, అదృష్టవశాత్తూ ఎలాంటి గాయాలు లేకుండా ఆయన బయటపడ్డారు. 

  • Loading...

More Telugu News