: వీడో రకమైన దొంగ.. చేతికేమీ చిక్కలేదని తిక్కరేగి బైక్స్ తగులబెట్టేశాడు


దొంగల్లో రకరకాలు.. దొంగతనానికేమీ దొరకకపోతే మరో ఏరియా చూసుకుంటారు దొంగలు.. కానీ వీడు మాత్రం తన హస్తలాఘవం చూపలేకపోవడంతో మండిపడి కనబడిన రెండు మోటార్ బైకుల్ని కాల్చేశాడు. హైదరాబాద్ మీర్ పేటలో శ్రీను అనే దొంగ అర్ధరాత్రి హల్ చల్ చేశాడు. అన్నపూర్ణ కాలనీలోని మూడు ఇళ్లలో చోరీకి విఫల యత్నం చేశాడు. సఫలం కాకపోవడంతో తిక్కరేగి ఎదురుగా ఉన్న రెండు బైకులను తగులబెట్టేశాడు. చెలరేగిన మంటల ధాటికి ప్రక్కనే ఉన్న కారు కూడా దెబ్బతింది. పొగవాసనకు నిద్రలేచిన కాలనీ వాసులు పోలీసులకు సమాచారమందించారు. అక్కడే అనుమానాస్పదంగా తిరుగుతున్న శ్రీనును అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News