: అమ్మకానికి మహాత్ముడి వ్యక్తిగత వస్తువులు
ఇప్పటికే మహాత్మా గాంధీ ఉపయోగించిన అనేక వస్తువులను లండన్ లో వేలానికి పెట్టడం తెలిసిందే. తాజాగా ఆయన పూణెలోని ఆగాఖాన్ ప్యాలెస్ కారాగారంలో ఉపయోగించిన మెటల్ ఆహార గిన్నె, రెండు చెక్క చెంచాలు, మరో చెక్క ఫోర్క్ ను లండన్ లోని బ్రిస్టల్ ల్లో అమ్మకానికి ఉంచారు. 'పాల్ ఫ్రేజర్' అనే సంస్థ సేకరించిన గాంధీ వస్తువులు 75వేల పౌండ్లకు అమ్ముడు పోయినట్లు కంపెనీ రిప్రజెంటేటివ్ తెలిపారు. అయితే, ఆ వస్తువులను వేలానికి పెట్టలేదని, కేవలం ప్రైవేటుగానే అమ్మకానికి పెట్టినట్లు పేర్కొన్నారు. లండన్ లో ఉంటున్న భారతీయ ధనవంతులకు గాంధీ వస్తువులపై చాలా ఆసక్తి ఉందని, వారే వాటిని సొంతం చేసుకున్నట్లు చెప్పారు. అయితే, ఇప్పటికీ గాంధీ వస్తువులకి అత్యంత చరిత్రాత్మక ప్రాధాన్యత ఉందని తెలిపారు.