: అనుమానంతో జంట దారుణ హత్య
కరీంనగర్ జిల్లా మహాముత్తారం మండలం మహబూబ్ పల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వసంత్ అనే మహిళ, సురేష్ అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా నరికి చంపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తును ప్రారంభించారు. వివాహేతర సంబంధమే ఈ హత్యలకు కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.