: రామాంతపూర్ లోని పోచమ్మ గుడిలో భారీ చోరీ
హైదరాబాదులోని పోచమ్మ ఆలయంలో అమ్మవారి ఆభరణాలను చోరీ చేశారు. రామాంతపూర్ గోఖలే నగర్ లోని పోచమ్మ ఆలయంలో ఎనిమిది కిలోల వెండి ఆభరణాలను దొంగిలించారు. శనివారం ఉదయం చోరీ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.