: వితంతువులకు, వికలాంగులకు పింఛను పెంచే యోచనలో కేంద్రం


వితంతువులకు, వికలాంగులకు, వృద్ధులకు చెల్లించే పింఛను మొత్తాన్ని త్వరలో పెంచాలని కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక వేస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరామ్ రమేశ్ సోమవారం తెలిపారు. నేటి రాజ్యసభ సమావేశాల ప్రశ్నోత్తరాల సమయంలో ఓ సభ్యుడి ప్రశ్నకు సమాధాన మిచ్చిన మంత్రి... ప్రస్తుతం వితంతువులకు రూ.300, వికలాంగులకు రూ.200, వృద్ధులకు రూ.500 చొప్పున ఇస్తున్న పింఛన్ ను కొన్నిరోజుల్లో పెంచనున్నట్లు వెల్లడించారు.

అయితే దీనిపై చర్చిస్తున్నామనీ, మరో
  2,3 నెలల్లో నిర్ణయం వెలువడుతుందనీ అన్నారు. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, గోవా, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాలు తమ బడ్జెట్ నుంచే పింఛన్లను ఇస్తున్నాయన్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఇలాంటి సహకారం లేదని చెప్పారు.

  • Loading...

More Telugu News