: నేడు ములాయం సింగ్ సైకిల్ ర్యాలీ
సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఈ రోజు లక్నోలో సైకిల్ ర్యాలీ చేపట్టనున్నారు. నేటి నుంచి ఈ నెల 7 వరకు ఈ ర్యాలీ కొనసాగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన ఈ ర్యాలీ ద్వారా.. పార్టీ సాధించిన విజయాలు, పార్టీ విధానాలపై ప్రజల్లో అవగాహన కల్పించనున్నారు. గతంలో జరిగిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ఎస్పీ సైకిల్ ర్యాలీ నిర్వహించింది.