: అమెరికా సదస్సుకు మహిళా సర్పంచ్
ఆమె ఎంబీయే పట్టభద్రురాలు. ఐడీబీఐలో మంచి ఉద్యోగం. చక్కటి వేతనం. కానీ, ఎందుకో అందులో ఆమెకు సంతృప్తి దొరకలేదు. ప్రజాసేవకై నాయకురాలు కావాలనుకుంది. ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఒడిశాలోని గంజాం జిల్లా ధుంకపర గ్రామ సర్పంచ్ గా పోటీ చేసి గెలిచింది. ఆమే 28 ఏళ్ల ఆరతీదేవి! ఇప్పుడు ఆమె మరో ఘనత సాధించనున్నారు. అమెరికాలో ఈ నెలలో జరగనున్న ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సదస్సుకు భారత దేశం తరఫున ఆమె ఒక్కరే హాజరుకానున్నారు. ఈ మేరకు ఆరతీదేవికి ఆహ్వానం అందింది. ఇల్లినాయిస్ రాష్ట్రంలోని స్ప్రింగ్ ఫీల్డ్ లో జరిగే లీడర్ షిప్ కార్యక్రమంలో పాలనలో పారదర్శకత, జవాబుదారీతనంపై ఆమె మాట్లాడతారు.