: సోమవారం రాష్ట్రపతికి టీబిల్లు నివేదిక.. ప్రత్యేకంగా తిరస్కార తీర్మానం
టీబిల్లుకు సంబంధించి అసెంబ్లీలో ఆఖరి అంకం ప్రారంభమయింది. విభజన బిల్లుపై అసెంబ్లీ అభిప్రాయాల నివేదిక వాయువేగంతో సిద్ధమవుతోంది. నివేదిక తయారీలో అసెంబ్లీ సిబ్బంది తలమునకలై ఉన్నారు. రేపు సాయంత్రానికి నివేదికకు తుది రూపు రానుంది. సోమవారం నాడు తుది నివేదికను రాష్ట్రపతికి పంపడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నివేదికలో సభ్యులు ప్రతిపాదించిన 9,072 సవరణలు, 86 మంది ప్రసంగాలు, 250 కి పైగా లిఖిత పూర్వక అభిప్రాయాలు ఉంటాయి. దీంతో పాటు, అత్యంత వివాదాస్పదమైన, ముఖ్యమైన తిరస్కార తీర్మానం నివేదికను ప్రత్యేకంగా పంపనున్నారు.