: సికింద్రాబాద్-విశాఖ మధ్య నాలుగు ఏసీ రైళ్లు


ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండడంతో సికింద్రాబాద్-విశాఖ మధ్య నాలుగు ప్రత్యేక ఏసీ రైళ్లను తిప్పుతున్నట్లు దక్షణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 7, 14వ తేదీలలో రాత్రి 10.10గంటలకు రైలు(02728) సికింద్రాబాద్ లో బయల్దేరి మర్నాడు ఉదయం విశాఖ చేరుతుంది. 8, 15వ తేదీలలో రైలు(02727 ) విశాఖలో రాత్రి 7.05 గంటలకు బయల్దేరి మర్నాడు ఉదయం సికింద్రాబాద్ చేరుతుంది. అలాగే, కాకినాడ, ముంబై మధ్య ఈ నెల 3 నుంచి లోకమాన్యతిలక్ టెర్మినస్ బై వీక్లీ రైలు పట్టాలెక్కనుంది. కాకినాడలో దీన్ని 3న ఉదయం ప్రారంభిస్తారు. ఇది వారంలో రెండు సార్లు తిరుగుతుంది. ఉదయం 10 గంటలకు కాకినాడలో బయల్దేరి రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్, మర్నాడు ఉదయం 11 గంటలకు ముంబై చేరుతుంది.

  • Loading...

More Telugu News