: జగన్ కు డబ్బు పిచ్చి పట్టింది: మారెప్ప
వైఎస్సార్సీపీ అధినేత జగన్ కు డబ్బుపిచ్చి పట్టిందని మాజీ మంత్రి మారెప్ప తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ, విజయవాడ లోక్ సభ సీటు ఆశించిన వ్యక్తిని జగన్ 60 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినందువల్ల అతను అమెరికా పారిపోయాడన్నారు. తన వద్దకు వచ్చిన వ్యక్తులకు వైఎస్సార్ చెవిలో పూలు పెడితే, జగన్ సీసం పోస్తాడని మారెప్ప విమర్శించారు.