: కేవీపీ, సుబ్బరామిరెడ్డి, ఖాన్ లతో డిగ్గీరాజా సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్ హైదరాబాదు చేరుకోగానే తన మార్కు రాజకీయాన్ని చూపించారు. శంషాబాద్ విమానాశ్రయంలో దిగుతూనే రాజ్యసభకు బరిలో మిగిలిన అభ్యర్థులతో విడివిడిగా సమావేశమయ్యారు. కేవీపీ రామచంద్రరావు, టి. సుబ్బరామిరెడ్డి, ఎం.ఎ.ఖాన్ లతో మంతనాలు జరిపారు. రెబల్ అభ్యర్థి ఆదంపై ఆరా తీశారు. ముఖ్యమంత్రి, సీమాంధ్ర నేతలను పట్టించుకోనక్కర్లేదన్న రీతిలో వ్యాఖ్యలు చేశారు. తాము మాత్రమే మాటకు కట్టుబడే వాళ్లమని, మిగిలిన వారంతా గాలివాటం మనుషులు అనేలా చెప్పేసి పార్టీ నేతలతో వెళ్లిపోయారు.