: ఫిబ్రవరి 10లోగా పార్లమెంటులో తెలంగాణ బిల్లు: డీఎస్


ఫిబ్రవరి పదిలోగా పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు ప్రవేశపెడతారని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. పదిహేనవ తేదీ కంటే ముందే పార్లమెంట్ ఉభయసభల్లో మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందుతుందని ధీమా వ్యక్తం చేశారు. హరిహరాదులు అడ్డొచ్చినా తెలంగాణ రాష్ట్రాన్ని ఆపలేరన్నారు. తెలంగాణ ఏర్పాటుకు న్యాయపరంగా కూడా ఎలాంటి చిక్కులు రావన్న డీఎస్, తెలంగాణ నిర్ణయం నేపథ్యంలో కాంగ్రెస్ లో టీఆర్ఎస్ విలీనం సరైన మార్గమని సూచించారు. రాజ్యసభ స్వతంత్ర అభ్యర్ధిగా పోటీలో ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి వ్యవహారంపై మాట్లాడిన ఆయన, ఎవరో వెనక లేనిదే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ ఎలా వేస్తారు? అని ప్రశ్నించారు. పార్టీ నుంచి వెళ్లిపోయేందుకు నిర్ణయించుకున్న వారే పార్టీని ధిక్కరించి రాజ్యసభకు పోటీ చేస్తారన్నారు.

  • Loading...

More Telugu News