: బీజేపీలో చేరిన సంగీత దర్శకుడు బప్పీలహరి
బాలీవుడ్ సంగీత దర్శకుడు బప్పీలహరి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలోనే బప్పీ బీజేపీలో చేరారు.