: ఫిబ్రవరి మూడోవారం ఆఖరికి తెలంగాణ: జైపాల్ రెడ్డి


రాష్ట్ర తెలంగాణ నేతల మాదిరిగానే కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి కూడా ప్రత్యేక రాష్ట్రంపై స్పష్టతతో ఉన్నారు. ఫిబ్రవరి మూడోవారం ఆఖరికల్లా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని నొక్కి చెప్పారు. కాబట్టి, తెలంగాణ ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలలోను, ప్రజా ప్రతినిధుల్లోను విభజన వచ్చిందన్నారు. ప్రజల్లో వచ్చిన విభజన వల్లే కేంద్రం నిర్ణయం తీసుకుందని మంత్రి చెప్పారు. ఒకసారి రాష్ట్రం విభజించిన తర్వాత ఎలాంటి ఆవేశాలు ఉండవని భరోసా ఇచ్చారు. ఈ విషయంలో సీమాంధ్ర ప్రజల్లో భ్రమలు కలగకూడదని, తెలంగాణ ప్రజల్లో భయాలు ఉండకూడదని మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఆర్టికల్ 3కి సర్వసత్తాక అధికారం ఉందని, రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు కొన్ని తీసుకుని గవర్నర్ కు ఇవ్వడంలో తప్పులేదని అభిప్రాయపడ్డారు. ఇంతకీ సీఎం తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా పాస్ చేసినట్లా? అని జైపాల్ రెడ్డి ఎదురు ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News