: ముఖ్యమంత్రిది తొండి తీర్మానం: జైపాల్ రెడ్డి
రాష్ట్ర శాసనసభలో విభజన బిల్లును తిరస్కరిస్తూ తీర్మానం పెట్టడాన్ని కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి ఖండించారు. ముఖ్యమంత్రిది తొండి తీర్మానమని, దానికి రాజ్యాంగపరంగా విలువలేదని ఆయన అన్నారు. ఆ తీర్మానం వల్ల రాష్ట్ర విభజన ఆగుతుందని అనుకోవడం భ్రమేనని ఆయన చెప్పారు. ఏకపక్షంగా ఐక్యత కోరడంలో ఉండే అసహజత్వాన్ని ఎవరూ గ్రహించడంలేదని కేంద్ర మంత్రి అన్నారు. విభజన కోరుతూ ఇంత పెద్దఎత్తున ఉద్యమించిన తర్వాత కూడా ఎలా కలిసుండాలని ఆయన ప్రశ్నించారు. ఆర్టికల్ 3 కింద అభిప్రాయాలు చెప్పాలని రాష్ట్రపతి బిల్లును శాసనసభకు పంపారని, మూజువాణి ఓటుతో క్షణంలో తీర్మానం ఆమోదించడం తప్పుడు విధానమని జైపాల్ అభిప్రాయపడ్డారు.