: మెట్రో ప్రాజెక్టులో స్థానికులకే ఉద్యోగాలివ్వాలి: కోదండరాం
హైదరాబాద్ నగరంలో చేపడుతున్న మెట్రో ప్రాజెక్టులో స్థానికులకు 80 శాతం ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరాం డిమాండు చేశారు. ఈ మేరకు ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన స్థానికులకే ఉద్యోగాలివ్వాలంటూ టీఆర్ఎస్ ఉప్పల్ ల్లో ధర్నా చేపట్టింది. ధర్నాలో కోదండరాం, ఉద్యోగ సంఘాల జేఏసీ నేత శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.