: తెలంగాణ బిల్లుపై సీఎం వైఖరి ఊహించనిది: అభిషేక్ సింఘ్వీ
తెలంగాణ బిల్లుపై శాసనసభలో ముఖ్యమంత్రి వైఖరి ఊహించనిదని ఏఐసీసీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ అన్నారు. అయితే, విభజన బిల్లుకు శాసనసభ రాజముద్ర అవసరం లేదని చెప్పారు. విభజన క్రమంలో అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తామన్నారు. తెలంగాణపై మొసలి కన్నీరు కార్చిన వారి సంగతి పార్లమెంటులో తేలుతుందని పేర్కొన్నారు. అయితే, బిల్లుపై సవరణలను రాష్ట్రపతికి పంపిస్తామని స్పీకర్ చెప్పారన్నారు. ఇప్పటికీ తెలంగాణ ప్రకటనకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్న సింఘ్వీ అంతిమ నిర్ణయం పార్లమెంటుదేనని చెప్పారు.