: బిల్లు ఆపడానికి చాలా అస్త్రాలు ఉన్నాయి: లగడపాటి
పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లును అడ్డుకునేందుకు తమ వద్ద చాలా అస్త్రాలు ఉన్నాయని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలిపారు. విశాఖపట్నంలో ఆయన మాట్లాడుతూ, ఫిబ్రవరి 15 వ తేదీలోగా బిల్లును ఆమోదింపచేయాలని కాంగ్రెస్ పార్టీ కృతనిశ్చయంతో ఉందని అన్నారు. ఈ 15 రోజులు సీమాంధ్ర ప్రాంతంలోని రాజకీయ పార్టీల నేతలందర్నీ పరుగులు పెట్టించాలని ఆయన ప్రజలను కోరారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు పార్టీల కతీతంగా ఒక్కటవ్వడం చరిత్రాత్మకం అని ఆయన అన్నారు.