: సౌదీలో భారతీయుడికి శిరచ్ఛేదం


సౌదీ అరేబియాలో భారతీయ కార్మికుడికి శిరచ్ఛేదం అమలు చేశారు. తనకు ఉపాధి కల్పించిన డాఫిర్ ఆల్-డొసరిని హత్య చేసిన భారతీయ కార్మికుడు మహ్మద్ లతీఫ్ కు శిరచ్ఛేదం ద్వారా మరణశిక్ష అమలు చేసినట్టు సౌదీ ఆంతరంగిక వ్యవహారాల శాఖ వెల్లడించింది. డాఫిర్ తో గొడవపడ్డ మహ్మద్ లతీఫ్ అతనిని ఇనుప రాడ్ తో కొట్టి చంపేశాడు. అనంతరం అక్కడే గొయ్యి తీసి పాతిపెట్టాడు. కేసు విచారించిన న్యాయస్థానం అతడికి శిరచ్ఛేదం విధించింది.

లతీఫ్ పిల్లలు చిన్నవాళ్లని, వారు పెరిగి పెద్దవారయిన తరువాత శిక్ష అమలు చేయాలని గతంలో శిక్ష అమలును కోర్టు వాయిదా వేసింది. నిన్న శిక్ష అమలు చేశారని సౌదీ ప్రభుత్వం తెలిపింది. కాగా, ఈ ఏడాది ముగ్గురికి శిరచ్ఛేదం శిక్ష అమలు జరిగింది. సౌదీలో హత్య, అత్యాచారం, దోపిడీ, మాదకద్రవ్యాలు వంటి నేరాలకు షరియా చట్టం ప్రకారం ఇలాంటి కఠిన శిక్షలు విధిస్తారు.

  • Loading...

More Telugu News