: అవినీతి నేతల చిట్టా విప్పిన కేజ్రీవాల్
దేశంలో అవినీతి నేతల చిట్టాను ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ విప్పారు. వీరిలో కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, కపిల్ సిబల్, కమల్ నాథ్, వీరప్ప మొయిలీ, శరద్ పవార్, చిదంబరం ఉన్నారు. అలాగే, సురేశ్ కల్మాడీ, నితిన్ గడ్కరీ, ములాయం సింగ్ యాదవ్, బీఎస్ యడ్యూరప్ప, అనంత్ కుమార్, అనురాగ్ ఠాకూర్, ప్రపుల్ పటేల్, అళగిరి, కనిమొళి, ఏ రాజా, అసోం సీఎం తరుణ్ గొగోయ్, మాయావతి, నవీన్ జిందాల్ తదితరులు ఉన్నారు. వీరిని పార్లమెంటులో అడుగుపెట్టకుండా తగిన అభ్యర్థులను వీరిపై పోటీకి దింపుతామని కేజ్రీవాల్ తెలిపారు.