: అమెరికా దీవుల్లో భారీ భూకంపం
అమెరికాలోని శాంతాక్రుజ్ దీవుల్లో ఈ ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 8.0 గా నమోదైంది. దీంతో శాస్త్రవేత్తలు సునామీ హెచ్చరికలను జారీ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అందాల్సి వుంది. అయితే, దీని వల్ల భారత్ కు ముప్పేమీ లేదని మన శాస్త్రవేత్తలు తెలిపారు.