: రాజ్యసభ పోటీలో చివరికి నిలిచేదెవరు?


రాజ్యసభ నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇవాళ్టితో ముగుస్తుండటంతో కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థుల ఉపసంహరణ చర్చనీయాంశంగా మారింది. రాజ్యసభ అభ్యర్థి చైతన్యరాజు పోటీ నుంచి వైదొలిగేలా.. ముఖ్యమంత్రి మంతనాలు సాగించినట్లు తెలుస్తోంది. మంత్రులు గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాపరెడ్డి, శత్రుచర్ల విజయరామరాజుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రిని క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, ఇటీవల వైఎస్సార్సీపీలో చేరిన ఎంపీ ఎస్పీవై రెడ్డి కూడా ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.

  • Loading...

More Telugu News