: 'యాహూ' కస్టమర్ల అకౌంట్ పాస్ వర్డ్ లు చోరీ!


తమ కస్టమర్ల ఈ-మెయిల్ అకౌంటు పాస్ వర్డ్ లు చోరీ అయినట్లు యాహూ కంపెనీ తెలిపింది. దానివల్ల ఎన్ని అకౌంటులు ప్రభావితం అయ్యాయో మాత్రం చెప్పలేదు. ఈ విషయాలను కంపెనీ బ్లాగులో యాహూ పోస్ట్ చేసింది. ఇటీవల పంపిన కొన్ని సెంట్ మెయిల్స్ ద్వారా పేర్లు, ఈ మెయిల్ అడ్రస్ లు ప్రభావితమైనట్లు సమాచారం తెలిసిందని పేర్కొంది. అయితే, ఈ మొత్తం సమాచారాన్ని తమ సొంత సిస్టమ్స్ ద్వారా తీసుకోలేదని, మూడో పార్టీ డేటాబేస్ నుంచి పొందినట్లు వివరించింది. అయితే, మిగతా దాడులు జరగకుండా అదనపు చర్యలు తీసుకుంటామని తెలిపింది.

  • Loading...

More Telugu News