: స్పందిస్తున్న షూమాకర్


లెజెండరీ ఫార్ములా వన్ రేసర్ షూమాకర్ వైద్యుల సూచనలకు ప్రతిస్పందిస్తున్నారు. మెదడులో వాపు తగ్గించడం కోసం షూమాకర్ కు ఇప్పటి వరకూ అధిక మోతాదులో మత్తుమందులు ఇస్తూ, కృత్రిమ కోమాలో వుంచి, వైద్యులు చికిత్సనందిస్తున్నారు. దాన్ని తగ్గిస్తుండడంతో షూమాకర్ కళ్లార్పుతున్నారు. ఆయనలో స్పందనలు కనిపిస్తున్నాయి. డిసెంబర్ 29న స్కీయింగ్ చేస్తుండగా పట్టుతప్పి షూమాకర్ కిందపడడం, మెదడుకు గాయమైన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News