: బీజేపీ వెనక్కి తగ్గినా, యూపీఏ సాధారణ మోజారిటీతో నెగ్గించుకుంటుంది: మధుయాష్కీ
పార్లమెంటులో తెలంగాణకు మద్దతుపై బీజేపీ వెనక్కి తగ్గినా, యూపీఏ ప్రభుత్వం సాధారణ మెజారిటీతో ఉభయసభల్లో తెలంగాణ బిల్లును ఆమోదించుకుంటుందని ఎంపీ మధుయాష్కీ అన్నారు. బిల్లుపై అసెంబ్లీ ప్రక్రియ పూర్తయినందున పార్లమెంటులో బిల్లు ఆమోదం తధ్యమన్నారు. ఈ మేరకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో మీడియాతో యాష్కీ మాట్లాడారు. కాగా, కేవీపీ సహా సీమాంధ్ర నేతలంతా పదవుల కోసం, అక్కడి ప్రజల ఓట్ల కోసం సమైక్య జపం చేస్తున్నారని ఆరోపించారు. సీమాంధ్ర ప్రాంత ప్రయోజనాల కోసం ఎవరూ కృషి చేయడం లేదని విమర్శించారు.