: ఆమెనే నా భర్తగా అంగీకరించు డాడీ!: హాంగ్ కాంగ్ కుబేరుడి తనయ
కూతురు కోసం 830 కోట్ల రూపాయల కట్నం ఆఫర్ ఇచ్చాడు. తన కూతుర్ని వివాహం చేసుకున్న వాడిని నోట్ల కట్టలతో పూజిస్తానన్నాడు హాంగ్ కాంగ్ కుబేరుడు సెసిల్ చావో జెట్సుంగ్. పాపం, కూతుర్ని ఒకింటి దాన్ని చేసేయాలన్నది ఆయన తపన. అందుకే అంత కట్నం ఇస్తానన్నాడు. కానీ, జెట్సుంట్ కూతురు జిగిదావో మాత్రం 'ప్లీజ్ పెళ్లొద్దు డాడీ' అంటూ ఆయనకు లేఖ రాసింది. ఆమె స్వలింగ సంపర్కురాలు. అందుకే ఆమెను పెళ్లాడేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. జిగిదావో తొమ్మిదేళ్లుగా సియన్ అనే మహిళతో డేటింగ్ చేస్తోంది. 'ఆమెనే తన జీవిత భాగస్వామి'గా గుర్తించాలని లేఖలో తండ్రిని కోరడం ద్వారా ఆయనను ఆందోళనకు గురిచేసింది.