: వనస్థలిపురం త్రిశక్తి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు
హైదరాబాదు నగరంలోని వనస్థలిపురం హరిహరపురం కాలనీలో నిర్మించిన త్రిశక్తి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు మూడు రోజుల పాటు వైభవంగా జరుగుతున్నాయి. నూతనంగా నిర్మించిన ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమానికి పరిసర కాలనీవాసులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. మూడో రోజు పుష్పాభిషేకం కన్నులపండువగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలతో ఆలయంలోని అమ్మవార్ల విగ్రహాలను పువ్వులతో అభిషేకించారు.