: సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ పగ్గాలు తెలుగోడి చేతికి!


తెలుగువాడు మరోసారి గర్వంగా భావించే సందర్భం రానుంది. ప్రపంచ సాఫ్ట్ వేర్ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ కంపెనీ ముఖ్య కార్యనిర్వాహక అధికారి (సీఈఓ)పదవిని తెలుగు వాడైన సత్య నాదెళ్ల చేపట్టడం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన నేటి అర్ధరాత్రి (అమెరికాలో శుక్రవారం మధ్యాహ్నం) వెలువడనుంది. మైక్రోసాఫ్ట్ సీఈఓగా సత్య నాదెళ్లను నియమించే అవకాశాలున్నట్లు అమెరికాలో పలు వార్తా సంస్థలు తాజాగా పేర్కొనడమే దీనికి నిదర్శనంగా భావించవచ్చు. సత్య మైక్రోసాఫ్ట్ లో ప్రస్తుతం కోడ్, ఎంటర్ ప్రైజెస్ విభాగం చీఫ్ గా ఉన్నారు. 1992 నుంచి మైక్రోసాఫ్ట్ తో ఆయన కలిసి పనిచేస్తున్నారు. సత్య నాదెళ్లను సీఈఓగా నియమించవచ్చంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం స్టీవ్ బామర్ సీఈఓగా ఉన్నారు. సత్య హైదరాబాద్ లో జన్మించారు.

  • Loading...

More Telugu News