: 304 కొడితే విజయం మనదే
న్యూజిలాండ్ తో జరుగుతున్న చివరి వన్డేలో భారత్ ముందు మరోసారి భారీ విజయ లక్ష్యం ఖరారైంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. టేలర్ (102), విలియమ్ సన్(88) రాణించడంతో భారీ స్కోరు సాధ్యమైంది. అదే సమయంలో భారత బౌలర్లు పెద్దగా రాణించలేకపోయారు. కొత్తవాడే అయినా ఆరాన్ ఒక్కడే 2 వికెట్లు తీసుకున్నాడు. కోహ్లీ తప్ప మిగతా అందరి బౌలింగ్ లోనూ రన్ రేట్ 6గా ఉండడం గమనార్హం.