: బిట్రగుంట వద్ద రైల్లోంచి పడి టికెట్ కలెక్టర్ మృతి
నెల్లూరు జిల్లాలో అల్లూరు రోడ్డు-బిట్రగుంట రైల్వే స్టేషన్ల నడుమ నిన్న అర్ధరాత్రి దాటాక చెన్నై నుంచి న్యూఢిల్లీ వెళుతున్న తమిళనాడు ఎక్స్ ప్రెస్ రైల్లోంచి పడి టికెట్ కలెక్టర్ బాషా మృతి చెందారు. విషయం తెలిసి డ్రైవర్ రైలును నిలిపివేశాడు. 45 నిమిషాలపాటు గాలించినా బాషా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో రైలు యథావిధిగా వెళ్ళిపోయింది. తరువాత బిట్రగుంట రైల్వే రక్షకదళ ఎస్.ఐ తన సిబ్బందితో కలిసి గాలించగా 205/10-12 కిలోమీటరు సమీపంలో టీసీ మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా? లేక ఎవరైనా కిందకు తోసేశారా? అనే కోణంలో రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.