: శుక్రవారం నాటికి ఓటర్ల తుది జాబితా
హైదరాబాదు నుంచి రాష్ట్ర ముఖ్య ఎన్నికల కమిషనర్ భన్వర్ లాల్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటర్ల తుది జాబితాకు సంబంధించి నివేదికలు సిద్ధం చేస్తున్నామని ఈ సందర్భంగా కలెక్టర్లు భన్వర్ లాల్ కు తెలిపారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో వరంగల్ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 18-19 సంవత్సరాలు గల యువత 67,716 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారని చెప్పారు. 14,988 మంది బోగస్ ఓటర్లను గుర్తించినట్లు, వారిని జాబితా నుంచి తొలగించినట్లు తెలిపారు. జిల్లాలో ఓటర్లలందరికీ ఎపిక్ కార్డులు అందజేసినట్లు ఆయన తెలిపారు.
మేడారం జాతర సందర్భంగా ఉప కలెక్టర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోల బదిలీలను జాతర అనంతరం చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్ కోరారు అందుకు ఎన్నికల కమిషనర్ అనుమతించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో వరంగల్ జిల్లా జాయింట్ కలెక్టర్, కమిషనర్ పాండాదాస్, డీఆర్వో సురేందర్ తదితరులు పాల్గొన్నారు.