: 'మార్కెటింగ్' చేసుకోవడంలో మేం వీక్: దిగ్విజయ్
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తరహాలో సంక్షేమ పథకాలు, విధానాలను 'మార్కెటింగ్' చేసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. బీజేపీ తన విజయాలను పెద్దదిగా చేసి చూపడమే కాకుండా.. చివరకు 'అసత్యాలు' కూడా చెబుతోందని ఆయన ఆరోపించారు. "కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలు, విధానాలను ప్రారంభించింది కానీ, వాటిని మార్కెటింగ్ చేసుకోవడంలో విఫలమైంది" అని దిగ్విజయ్ తెలిపారు.