: మూడు ప్రైవేటు ఎయిర్ లైన్స్ కు డీజీసీఏ జరిమానా
మూడు ప్రైవేటు ఎయిర్ లైన్స్ సంస్థలు ఇండిగో, గో ఎయిర్, జెట్ ఎయిర్ వేస్ కు డీజీసీఏ జరిమానా విధించింది. దట్టమైన పొగమంచు ఏర్పడిన పరిస్థితుల్లో విమానాలను ల్యాండ్ చేసేందుకు శిక్షణ పొందిన పైలెట్లను ఉపయోగించని కారణంగా ఈ చర్యలు తీసుకుంది. ముఖ్యంగా ఢిల్లీలో ఇటువంటి జాగ్రత్తలు తీసుకోనందున జరిమానా వేస్తున్నట్లు తెలిపింది. అంతేకాక, ఈ మూడు ఎయిర్ లైన్స్ కు కేటాయించిన ల్యాండింగ్ స్థానాలను కూడా వెనక్కి తీసుకుంది. శీతాకాలంలో మంచు దట్టంగా ఉండే సమయాల్లో ఢిల్లీలో తప్పనిసరిగా శిక్షణ పొందిన పైలట్ లనే ఉపయోగించాలని గతేడాది డీజీసీఏ ఆదేశించింది. కానీ, ఈ ఆదేశాలను ఈ మూడు సంస్థలు బేఖాతరు చేశాయి.