: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి రాజీనామా?
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ రాజీనామా చేసినట్టు సమాచారం. అయితే ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. విజయ్ బహుగుణ స్థానంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి హరీష్ రావత్ ను ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా నియమించాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నట్టు తెలుస్తోంది.