: సబ్సిడీ సిలిండర్లను 9 నుంచి 12కు పెంచిన కేంద్ర మంత్రివర్గం


కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల పరిమితిని 9 నుంచి 12కు పెంచింది. ఢిల్లీలో ఈ రోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయించింది. దాంతో, ఇకనుంచి ఏడాదికి పన్నెండు సిలిండర్లు లభించనున్నాయి. గతంలో వీటి సంఖ్యను పెంచేది లేదని పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ స్పష్టం చేశారు. అయితే, కొన్ని రోజుల కిందట జరిగిన కీలకమైన ఏఐసీసీ సమావేశంలో, సిలిండర్ల సంఖ్యను పెంచాలని రాహుల్ గాంధీ బహిరంగంగా కోరడంతో... పెంచుతామని వెంటనే మొయిలీ ప్రకటించారు. ఈ క్రమంలో నేడు కేంద్రం అధికారికంగా సిలిండర్ల సంఖ్యను పెంచింది.

  • Loading...

More Telugu News