: బషీర్ బాగ్ లో సీఎం దిష్టిబొమ్మ దగ్ధం
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును శాసనసభలో తిరస్కరించడంపై తెలంగాణ విద్యార్థులు ఆగ్రహించారు. హైదరాబాదులోని బషీర్ బాగ్ లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని వ్యతిరేకిస్తూ ఆయన దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. సీఎం వైఖరిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. అనంతరం రోడ్డుపైనే బైఠాయించి ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్టుచేసి స్టేషన్ కు తరలించారు.