: ఫిబ్రవరి 2, 3 తేదీల్లో తూర్పు గోదావరి జిల్లాలో కేంద్ర మంత్రి పర్యటన
కేంద్ర పంచాయతీరాజ్, గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి కిషోర్ చంద్రదేవ్ ఫిబ్రవరి 2,3 తేదీల్లో తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీలో పర్యటించనున్నట్టు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ నాగరాణి ఓ ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి రెండో తేదీన రంపచోడవరం, మారేడుమిల్లి, గంగవరం, అడ్డతీగల మండలాల్లో కేంద్ర మంత్రి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారని ఆమె తెలిపారు. మూడో తేదీన పీఎంఆర్‌సీలో వివిధ శాఖలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలపై ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసామని ఆమె చెప్పారు. అదే రోజు మంత్రి వ్యవసాయ, ఉద్యానవన, ఐకేపీ, రాజీవ్ యువ కిరణాలు, మండల మహిళా సమాఖ్యలతో చర్చాగోష్టిలో పాల్గొంటారని ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ తెలిపారు.