: కాంగ్రెస్ కార్యాలయం ముందు సిక్కుల నిరసన
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీరుకు వ్యతిరేకంగా సిక్కులు దేశ రాజధానిలో నిరసన ప్రదర్శనకు దిగారు. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లపై క్షమాపణలు చెప్పడానికి రాహుల్ తిరస్కరించడంతో.. ఢిల్లీ సిక్కు గురుద్వారా కమిటీ, అకాలీదళ్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. రాహుల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు మాత్రం రాహుల్ కు ఈ అల్లర్లతో ఏమీ సంబంధం లేదని.. పార్టీ అధ్యక్షురాలు సోనియా, ప్రధాని మన్మోహన్ సింగ్ ఇప్పటికే క్షమాపణలు చెప్పారని ఆందోళనకారులను శాంతపరిచే ప్రయత్నం చేశారు.