: తెలంగాణ ఏర్పాటులో కీలక ఘట్టం ముగిసింది: దిగ్విజయ్


తెలంగాణ ఏర్పాటులో కీలక ఘట్టం ముగిసిందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ దిగ్విజయ్ సింగ్ అన్నారు. బిల్లుపై శాసనసభ తన బాధ్యత నిర్వహించిందని చెప్పారు. అయితే, తెలంగాణ బిల్లుపై సభలో ఓటింగు జరగలేదని చెప్పారు. ఈ తీర్మానం ఆర్టికల్ 3 కింద రాష్ట్రాన్ని విభజించడంపై ఎలాంటి ప్రభావం చూపదని చెప్పారు. బిల్లును అభిప్రాయం కోసం మాత్రమే పంపించామని ఓటింగు కోసం కాదన్నారు. రాజ్యాంగ అవసరం దృష్ట్యానే శాసనసభ అభిప్రాయాలు తీసుకున్నామన్న దిగ్విజయ్ కేబినెట్ సమావేశం అనంతరం పార్లమెంటు సమావేశాల్లో బిల్లును ప్రవేశపెడతారన్నారు. కాగా, సవరణలపై క్యాబినెట్ చర్చించి మంచి సలహాలుంటే బిల్లులో పొందుపరుస్తుందన్నారు. ఇప్పుడు తెలంగాణను వ్యతిరేకిస్తున్న వారంతా ఒకప్పుడు అనుకూలంగా లేఖలిచ్చారని, అన్ని పార్టీలు స్వేచ్చగా తమ అభిప్రాయం చెప్పేందుకు కేంద్రం అవకాశం ఇచ్చిందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News