: బిల్లు తిరస్కరణ.. ఓటమి కాదు, విజయం కాదు: రేణుకా చౌదరి
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లును రాష్ట్ర శాసనసభ తిరస్కరించడంపై కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి స్పందించారు. ఈ పరిణామం ఓటమి లేదా విజయం కాదన్నారు. ఎక్కువ మంది సభ్యుల ఆమోదంతోనే బిల్లును తిరస్కరించారని పేర్కొన్నారు. అయితే, తెలంగాణ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో సమస్యలు సృష్టించవద్దని రేణుక కోరారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలనే ముఖ్యమంత్రి సభలో తెలిపారన్న ఆమె... హింసాత్మక ధోరణితో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై నిర్ణయం తీసుకోలేదన్నారు. కానీ, అసెంబ్లీలో బిల్లు తిరస్కారానికి గురికావడం కేంద్రంలో కాంగ్రెస్ కు ఘోర అవమానమని చెప్పారు.